Talasani: వరంగల్ డిక్లరేషన్ దేనికి... రాష్ట్రానికా? దేశానికా?: కాంగ్రెస్ ను ప్రశ్నించిన తలసాని

Talasani asks Congress party on Warangal declaration
  • నిన్న వరంగల్ లో కాంగ్రెస్ సభ
  • వరంగల్ డిక్లరేషన్ ప్రకటన
  • స్పష్టత లేదన్న తలసాని
  • అది కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభ అని ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ నిన్న వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో డిక్లరేషన్ వెల్లడించడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. వరంగల్ డిక్లరేషన్ దేనికి... రాష్ట్రానికా? దేశానికా? అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. స్పష్టత లేని, ఆచరణ సాధ్యం కాని డిక్లరేషన్ ప్రకటించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది రైతు సంఘర్షణ సభ కాదని, అది కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభ అని ఎద్దేవా చేశారు. 

రైతుల కోసం టీఆర్ఎస్ చేసిన పోరాటంలో కాంగ్రెస్ ఎక్కడుందని నిలదీశారు. ఉద్యమం, కేసీఆర్ పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని, తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదని తలసాని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Talasani
Warangal Declaration
Congress
TRS
Telangana

More Telugu News