ఏపీ మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌ను ఘెరావ్ చేసిన‌ సొంత కుల‌స్తులు

  • వైవీ సుబ్బారెడ్డి ముందు మోక‌రిల్లిన మంత్రి
  • ఈ ఘ‌ట‌న‌పై శెట్టి బ‌లిజ‌ల ఆగ్ర‌హం
  • మంత్రి ప‌ద‌వి నుంచి వేణుగోపాల‌కృష్ణను త‌ప్పించాల‌ని డిమాండ్‌
Disgrace to AP Minister Venugopal Krishna

ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు త‌న సొంత జిల్లాలోనే శ‌నివారం ప‌రాభ‌వం ఎదురైంది. తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డ‌గించిన శెట్టి బ‌లిజ‌ కులస్తులు ఆయ‌న‌ను ఘెరావ్ చేశారు. వేణుగోపాలకృష్ణ‌ను త‌క్ష‌ణ‌మే మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసి త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంకో నేత‌కు మంత్రి ప‌ద‌వినివ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వైసీపీ కీల‌క నేత‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ముందు వేణుగోపాల‌కృష్ణ మోక‌రిల్లిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన శెట్టి బలిజ‌లు త‌మ కుల‌స్తుల ప‌రువును వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి తాక‌ట్టు పెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే శ‌నివారం శెట్టిబ‌లిజ‌ కులస్తులు వేణు గోపాల‌కృష్ణ కాన్వాయ్ ను అడ్డ‌గించారు.

More Telugu News