Punjab Kings: ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్

Punjab won the toss against RR
  • పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్
  • బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
  • ధాటిగా ఆడుతున్న ఓపెనర్లు
  • నేటి రెండో మ్యాచ్ లో లక్నో వర్సెస్ కోల్ కతా
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ముంబయి వాంఖెడే స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో (5 బ్యాటింగ్), శిఖర్ ధావన్ (11 బ్యాటింగ్) ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు. అటు, రాజస్థాన్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. కరుణ్ నాయర్ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడని రాజస్థాన్ సారథి సంజు శాంసన్ తెలిపాడు. ఇక, నేటి రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్ పూణేలోని ఎంసీయే స్టేడియంలో జరగనుంది.
Punjab Kings
Toss
Rajasthan Royals
IPL

More Telugu News