కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో ఏపీ మంత్రి ఆర్కే రోజా భేటీ

  • అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం విశాఖకు కిష‌న్ రెడ్డి
  • కేంద్ర మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన రోజా
  • రాష్ట్రంలో ప‌ర్యాట‌కాభివృద్ధిపై చ‌ర్చ‌
ap minister rk roja met with union minister kishan reddy

ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆర్కే రోజా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను వ‌రుస‌బెట్టి క‌లుస్తున్నారు. అందులో భాగంగా శ‌నివారం విశాఖ వ‌చ్చిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితోనూ ఆమె భేటీ అయ్యారు. 

అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం విశాఖ వ‌చ్చిన కిష‌న్ రెడ్డికి విమానాశ్ర‌యంలో రోజా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల అభివృద్ధిపై వారిద్ద‌రూ చ‌ర్చించారు.

More Telugu News