Vijay Sai Reddy: టీడీపీ నేతలే కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారు: విజయసాయిరెడ్డి ఆరోపణ

Vijayasai alleges TDP leaders caused to atrocities in state
  • గుంటూరు నాగార్జున వర్సిటీలో జాబ్ మేళా
  • ప్రారంభించిన విజయసాయిరెడ్డి 
  • ఏపీలో అత్యాచారాలకు టీడీపీ నేతలే కారణమని ఆరోపణ
  • వారి నేరాలను తమకు అంటగడుతున్నారని ఆగ్రహం
వైసీపీ నేతల వల్లే ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. టీడీపీ నేతలే కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. ఏపీలో అత్యాచారాలు టీడీపీ నేతల పనేనని అన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసే అత్యాచారాలను, హత్యలను వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా, వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని, గతంలో కంటే ఈసారి తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని భయపడేవాళ్లే పొత్తుల గురించి ఆలోచిస్తారని అన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదని తెలిపారు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని విజయసాయి స్పష్టం చేశారు.
Vijay Sai Reddy
Atrocities
TDP Leaders
YSRCP
Job Mela
ANU
Guntur District

More Telugu News