వంటింట్లో మంట.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

07-05-2022 Sat 09:24
  • ఉదయాన్ని చేదు వార్తను వినిపించిన చమురు సంస్థలు
  • గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటన
  • రూ. 1,052కి చేరుకున్న సిలిండర్ ధర
Cooking gas cylinder rate increased
ఇప్పటికే అన్ని ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఈ ఉదయాన్నే సామాన్య ప్రజలకు గుండె గుభేల్ మనిపించే చేదు వార్తను చమురు సంస్థలు వినిపించాయి. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ. 1,052కి చేరుకుంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఇటీవలే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను కూడా చమురు సంస్థలు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరుకుంది.