Union Home Minister: సౌర‌వ్ గంగూలీ ఇంట అమిత్ షా డిన్న‌ర్‌

Amit Shah met with BCCI chief Sourav Ganguly and had dinner with him
  • రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు కోల్‌క‌తాకు అమిత్ షా
  • కోల్‌క‌తాలోని గంగూలీ ఇంటికి వెళ్లిన కేంద్ర హోం మంత్రి
  • గంగూలీతో క‌లిసి అక్క‌డే రాత్రి విందు
ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... ఆ రాష్ట్ర రాజ‌ధాని కోల్‌క‌తాలో బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఇంటికి వెళ్లారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కోల్‌క‌తాకు చేరుకున్న అమిత్ షా... శుక్ర‌వారం రాత్రి న‌గ‌రంలోని గంగూలీ నివాసానికి వెళ్లారు. త‌న ఇంటికి వ‌చ్చిన అమిత్ షాకు గంగూలీ సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. ఆ త‌ర్వాత బీజేపీ నేత‌ల స‌మ‌క్షంలోనే ప‌లు అంశాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. ఆ త‌ర్వాత గంగూలీ ఇంటిలోనే ఆయ‌న‌తో క‌లిసి అమిత్ షా రాత్రి విందు చేశారు. పూర్తి శాకాహార పదార్థాలను మాత్రమే డిన్నర్లో వడ్డించడం జరిగింది.
Union Home Minister
Amit Shah
Sourav Ganguly
BCCI Chief

More Telugu News