YSRCP: చంద్ర‌బాబు పొత్తు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ కౌంట‌ర్‌

ysrcp mla mudunuri prasada raju fires on chandrababu comments
  • చంద్ర‌బాబుకు పొత్తులేమీ కొత్త కాదు
  • ఒంట‌రిగా పోటీ చేసే ద‌మ్ము ఒక్క జ‌గ‌న్‌కే ఉంది
  • 2024లో టీడీపీకి 23 సీట్లు కూడా రావ‌న్న ప్ర‌సాద‌రాజు
2024 ఎన్నికల‌కు సంబంధించి ఏపీలో అధికార వైసీపీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌జా ఉద్య‌మం జ‌ర‌గాల్సి ఉందని, ఆ ఉద్య‌మానికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై అధికార వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం పార్టీ కీల‌క నేత, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు స్పందిస్తూ.. చంద్ర‌బాబుకు పొత్తులేమీ కొత్త కాదన్నారు. 

జ‌గ‌న్‌ను ఎదుర్కొనే ద‌మ్ము చంద్ర‌బాబుకు లేదని, ఒంట‌రిగా పోటీ చేసే దమ్ము ఒక్క జ‌గ‌న్‌కే ఉందని ఆయన స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారన్న ప్ర‌సాద‌రాజు... 2024లో టీడీపీకి 23 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు.
YSRCP
YS Jagan
Muddunuri Prasada Raju
Narasapuram MLA
TDP
Chandrababu

More Telugu News