Andhra Pradesh: ఏపీలో నిలిచిపోయిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వర్లు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల సర్వర్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లోని అప్లికేషన్లు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో ఇన్ కమ్, క్యాస్ట్, ఈసీ తదితర సర్టిఫికెట్లను తీసుకోవాలనుకున్న వారందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మార్చి, ఏప్రిల్ లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ కూడా ఇంత వరకు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్లు ఆన్ లైన్ లో కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెపుతుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Registrations

More Telugu News