ఈ సమాజం అవాస్తవాలనే ఎక్కువగా నమ్ముతుంది: సమంత
- నాగచైతన్యతో విడిపోయిన సమంత
- సోషల్ మీడియాలో ఆసక్తి రేపేలా పోస్టులు
- నిజాలు అరుదుగా బయటికి వస్తాయంటూ తాజా పోస్టు
అయితే, ఈ వ్యాఖ్యలు ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందన్న విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. వ్యక్తిగత అంశాలకు సంబంధించి సమంత ఈ వ్యాఖ్యలు చేసిందని కొందరు అంటుంటే, ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రం చేస్తున్న సమంత... ఓ అంతర్జాతీయ ప్రాజెక్టును కూడా చేస్తోంది. హరి-హరీశ్ దర్శకత్వంలో వస్తున్న 'యశోద' చిత్రంలోనూ సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం నుంచి నిన్న గ్లింప్స్ కూడా రిలీజైంది.