Samantha: బాక్సాఫీస్ వద్ద... సమంత వర్సెస్ నాగచైతన్య!

Samantha Vs Naga Chaitanya
  • ఒక్కరోజు తేడాతో విడుదలవుతున్న సమంత, చైతూ సినిమాలు
  • ఆగస్ట్ 12న విడుదలవుతున్న సమంత నటించిన 'యశోద'
  • ఆగస్ట్ 13న రిలీజ్ కానున్న చైతూ నటించిన 'లాల్ సింగ్ చద్దా'
బాక్సాఫీస్ వద్ద అత్యంత ఆసక్తికరమైన పోటీకి సమయం ఆసన్నమవుతోంది. కేవలం ఒక్కరోజు తేడాతో సమంత, నాగచైతన్యలు నటించిన సినిమాలు విడుదల కాబోతున్నాయి. సమంత ప్రధాన పాత్రను పోషించిన 'యశోద' చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది. దర్శక ద్వయం హరి-హరీశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.   

మరోవైపు నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'లాల్ సింగ్ చద్దా' మూవీ ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలను పోషించగా... నాగచైతన్య కీలక పాత్రను పోషించాడు. ఒక్కరోజు తేడాతో మాజీ భార్యాభర్తల సినిమాలు విడుదల కానుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో? ఎవరు విజయాన్ని అందుకుంటారో? వేచి చూడాలి.
Samantha
Naga Chaitanya
Tollywood
Bollywood

More Telugu News