CM Jagan: పద్మావతి కార్డియాక్ ఆసుపత్రిలో జగన్ పర్యటన.. పసికందును లాలనగా చేతుల్లోకి తీసుకున్న సీఎం!

CM Jagan visits Padmavati cardiac center in Tirupati
  • తిరుపతిలో సీఎం జగన్ పర్యటన
  • చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ
  • పద్మావతి కార్డియాక్ విభాగంలో పర్యటన
  • చిన్నారిని లాలించిన వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఆపై, టాటా ట్రస్ట్ సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ రీసెర్చ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

అంతకుముందు ఆయన పద్మావతి కార్డియాక్ విభాగంలో పర్యటించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ పసిబిడ్డను ఎంతో వాత్సల్యంతో చేతుల్లోకి తీసుకుని లాలించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారందరినీ అలరించాయి.
CM Jagan
Infant
Padmavati Cardiac Center
Tirupati
YSRCP

More Telugu News