Rape Attempt: నెల్లూరు పరిధిలో విదేశీ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం కేసులో నిందితుల‌కు జీవిత ఖైదు

life imprisonment to accused in rape attempt on a foriegn lady
  • మార్చి 8న సైదాపురం స‌మీపంలో ఘ‌ట‌న‌
  • ఒంట‌రిగా ఉన్న విదేశీ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం
  • నిందితులు సాయి కుమార్, అబీద్‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఈ కేసు విచార‌ణ ముగించి నిందితుల‌కు శిక్ష ఖ‌రారు చేసిన కోర్టు
ఏపీలోని నెల్లూరు జిల్లా ప‌రిధిలో ఇటీవ‌ల‌ విదేశీ మ‌హిళ‌పై జ‌రిగిన అత్యాచార య‌త్నం కేసులో దోషులకు జీవిత ఖైదు ఖ‌రారైంది. అలాగే వారికి రూ.15 వేల చొప్పున జ‌రిమానా కూడా విధిస్తూ నెల్లూరు కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 

మార్చి 8న నెల్లూరు జిల్లా సైదాపురం స‌మీపంలో విదేశీ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఒంటరిగా ఉన్న విదేశీ మ‌హిళ‌పై సాయికుమార్‌, అబీద్ అనే యువ‌కులు అత్యాచారానికి య‌త్నించారు. అయితే విదేశీ మ‌హిళ తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో నిందితులు ప‌రార‌య్యారు. 

ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న విదేశీ మ‌హిళ నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇదివ‌ర‌కే నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచార‌ణ‌ను ముగించిన నెల్లూరు కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించి, ఇద్ద‌రికీ జీవిత ఖైదు విధిస్తూ కీల‌క తీర్పు చెప్పింది.
Rape Attempt
Nellore District
Nellore Court

More Telugu News