Rahul Gandhi: ఎన్ఎస్‌యూఐ నేత‌ల‌ను కలిసేందుకు చంచ‌ల్‌గూడ జైలుకు రాహుల్ గాంధీ... అనుమ‌తించాలంటూ జైళ్ల శాఖ డీజీకి రేవంత్ అభ్య‌ర్థ‌న‌

  • ఓయూలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు కౌన్సిల్ నిరాక‌ర‌ణ‌
  • కౌన్సిల్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎన్ఎస్‌యూఐ నిర‌స‌న‌
  • అరెస్ట్ చేసి చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించిన పోలీసులు
  • అరెస్టయిన విద్యార్ధి నాయకులను క‌లిసేందుకు చంచ‌ల్‌గూడ‌కు రాహుల్‌
revanth reddy requested ts jails dg to allow rahul gandhi in tochanchalguda jail

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్‌కు ఈ నెల 7న రానున్నారు. ఈ సంద‌ర్భంగా చంచ‌ల్‌గూడ జైలులోని పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నేత‌ల‌ను క‌లిసే అవ‌కాశాలున్నాయి. చంచ‌ల్‌గూడ జైలులోకి రాహుల్ గాంధీని అనుమ‌తించాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ జితేంద‌ర్‌ను క‌లిసి ఓ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ మేర‌కు చంచ‌ల్‌గూడ్ జైలులోకి రాహుల్‌ను అనుమ‌తించాల‌ని డీజీని రేవంత్ రెడ్డి కోరారు. 

ఉస్మానియా విద్యార్థుల‌తో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ వ‌ర్సిటీకి వ‌స్తార‌ని అనుమ‌తి ఇవ్వాలంటూ ఇదివ‌ర‌కే వ‌ర్సిటీ వీసీకి టీపీసీసీ విజ్ఞ‌ప్తి చేసింది. అయితే వ‌ర్సిటీ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అందుకు అనుమ‌తించ‌లేదు. ఈ నేప‌థ్యంలో కౌన్సిల్ నిర్ణ‌యంపై వ‌ర్సిటీలో ఎన్ఎస్‌యూఐ నేత‌లు నిర‌స‌న‌కు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. వీరిని క‌లిసేందుకే రాహుల్ గాంధీ చంచ‌ల్‌గూడ జైలుకు వ‌స్తార‌ని, అనుమ‌తించాల‌ని డీజీని రేవంత్ రెడ్డి కోరారు.

More Telugu News