Talari Venkatrao: త‌న‌పై దాడి చేసిన వారి ఫొటోలు విడుద‌ల చేసిన వైసీపీ ఎమ్మెల్యే

gopalapurammla releases photos of who attacked on him
  • జి.కొత్త‌ప‌ల్లిలో ఎమ్మెల్యే త‌లారిపై దాడి
  • రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే దాడి అన్న ఎమ్మెల్యే
  • టీడీపీ ప్రోద్బ‌లంతోనే దాడి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌
ఏలూరు జిల్లా గోపాల‌పురం ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావు త‌న‌పై జ‌రిగిన దాడిపై తాజాగా స్పందించారు. రాజ‌కీయ కుట్ర కార‌ణంగానే త‌నపై దాడి జ‌రిగింద‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా టీడీపీ ప్రోద్బ‌లంతోనే త‌న‌పై దాడి జ‌రిగింద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. విప‌క్ష టీడీపీ హ‌త్యా రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించిన త‌లారి...త‌న‌పై దాడి చేసిన వారి ఫొటోల‌ను విడుద‌ల చేశారు.

ఏలూరు జిల్లా ద్వార‌కా తిరుమ‌ల మండ‌లం జి.కొత్త‌ప‌ల్లిలో వైసీపీ గ్రామ అధ్య‌క్షుడు గంజి ప్ర‌సాద్ దారుణ హ‌త్య‌కు గురి కాగా... ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావుపై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడి గంజి ప్ర‌సాద్ వ‌ర్గానికి చెందిన వారి ప‌నేన‌న్న వార్త‌లు రాగా... తాజాగా టీడీపీ ప్రోద్బలంతోనే త‌న‌పై దాడి జ‌రిగింద‌ని ఎమ్మెల్యే ఆరోపించారు.
Talari Venkatrao
YSRCP
Eluru District
Gopalapuram MLA

More Telugu News