YSRCP: చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరు: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌

avanthi srinivas fires chandrababu north andhra tour
  • ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు
  • ఏ ముఖం పెట్టుకుని వ‌చ్చార‌న్న అవంతి
  • బ‌షీర్‌బాగ్ కాల్పుల‌ను మ‌రిచారా? అంటూ ప్ర‌శ్న‌
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నేత‌, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్య‌టించిన చంద్ర‌బాబు... గురువారం విశాఖ‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా స్పందించిన అవంతి శ్రీనివాస్‌... చంద్ర‌బాబును న‌మ్మే స్థితిలో జ‌నం లేర‌ని అన్నారు. బ‌షీర్ బాగ్ కాల్పుల ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు మ‌రిచిపోయారా? అని అవంతి ప్ర‌శ్నించారు. మూడు రాజ‌ధానుల‌ను అడ్డుకున్న చంద్ర‌బాబు ఏ ముఖం పెట్టుకుని ఉత్త‌రాంధ్ర‌కు వ‌చ్చార‌ని అవంతి నిల‌దీశారు.
YSRCP
Avanthi Srinivas
North Andhra
TDP
Chandrababu

More Telugu News