Andhra Pradesh: కుమారుడు, ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న త‌ల్లి.. ఇద్ద‌రి మృతి

suicide attempt in ap
  • శ్రీకాకుళం జిల్లాలోని యలమంచిలి గ్రామంలో ఘ‌ట‌న‌
  • త‌ల్లి చిన్నమ్మడు(46)తో పాటు కూతురు  జాహ్నవి(17)మృతి
  • కుమారుడు శశాంక్‌, మరో కూతురు రజనికి చికిత్స‌
శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. వారిలో త‌ల్లి చిన్నమ్మడు(46)తో పాటు కూతురు జాహ్నవి(17) మృతి చెందారు. కుమారుడు శశాంక్‌, మరో కూతురు రజని శ్రీ‌కాకుళం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

శశాంక్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తండ్రి నరసింహులు వేరే గదిలో నిద్రిస్తుండగా, మ‌రో గ‌దిలో మిగిలిన కుటుంబ సభ్యులు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వారు ఈ ఘ‌ట‌న‌కు ఎందుకు పాల్ప‌డ్డార‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నారు.
Andhra Pradesh
Srikakulam District

More Telugu News