MS Dhoni: ధోనీ అవుట్ తో అంత రెచ్చిపోవాలా? కోహ్లీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు

  • హేజిల్ వుడ్ బంతికి దొరికిపోయిన ధోనీ
  • పళ్లు బిగపట్టి గట్టిగా అరుస్తూ ఊగిపోయిన కోహ్లీ
  • మామూలుగా సెలబ్రేట్ చేసుకుని ఉండాల్సిందంటూ వ్యాఖ్యలు 
  • సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, విమర్శలు
Virat Kohli blasted for aggressive celebration after MS Dhoni dismissal during RCB vs CSK IPL match

విరాట్ కోహ్లీ మరోసారి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. బుధవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ప్రవర్తనను నెటిజన్లు, సీఎస్కే అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీని వరించింది. 

ఆటలో భాగంగా జోష్ హేజిల్ వుడ్ వేసిన బంతికి ధోనీ వికెట్ పడిన వెంటనే.. విరాట్ కోహ్లీ రెండు చేతులు పిడికిలి బిగించి... పళ్లు బిగపట్టి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ కు, మరో మాజీ కెప్టెన్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 

ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ లో అర్ధ శతకం మినహా.. రాణించింది లేదు. అటువంటి ఆటగాడు ఇలా వ్యవహరించడం ఏంటబ్బా..? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘ఆమోదనీయం కాదు. భారత ఆర్మీ ఉద్యోగిని విమర్శిస్తున్నాడు. ఈ కోహ్లీ జాతి వ్యతిరేకుడని ఎల్లప్పుడూ తెలుసు’’ అంటూ సర్ దిండా అనే యూజర్ కామెంట్ పెట్టాడు. 

‘‘విరాట్ వికెట్ పడిన తర్వాత.. ధోనీ వికెట్ తర్వాత దృశ్యాలను చూస్తే వ్యత్యాసం తెలుస్తుంది. ఒక విరాట్ అభిమానిగా అతడి నుంచి ఈ రకమైన ప్రవర్తనను ఊహించలేదు. ఈ రకమైన ప్రవర్తనతో కాకుండా సెలబ్రేట్ చేసుకుని ఉండాల్సింది. క్రికెట్ లో ప్రవర్తన ముఖ్యం’’ అని రాహుల్ అనే యూజర్ కామెంట్ చేశాడు. 

ఈ మ్యాచ్ లో ఓటమితో సీఎస్కే ప్రస్తుత సీజన్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. ఎందుకంటే 10 మ్యాచులకు గెలించింది మూడింటిలోనే. మిగిలిన నాలుగింటిలో గెలిచినా 7 విజయాలతో 14 పాయింట్లకు చేరుతుంది. అయినా చేరడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

More Telugu News