బండి సంజయ్‌తో కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ... జేపీ నడ్డా టూర్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
- మహబూబ్ నగర్ జిల్లాలో బండితో కొండా భేటీ
- ఈ భేటీకి ముందు జితేందర్ రెడ్డితోనూ కొండా మీటింగ్
- రేపు తెలంగాణకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- బీజేపీలో కొండా చేరతారా? అన్న దిశగా విశ్లేషణలు
ఈ భేటీకి ముందు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితోనూ విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురువారం నాడు మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆయన పర్యటనకు ఓ రోజు ముందు ఇలా బీజేపీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.