UNO: ఐరాస అవార్డులకు నామినేట్ అయిన ఏపీ ఆర్బీకేలు: ఏపీ వ్యవసాయమంత్రి కాకాణి

rbks nominated to fao awards
  • ఐరాస ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తున్న ఏఫ్ఏఓ
  • ఎఫ్ఏఓ అవార్డు‌కు నామినేట్ అయిన ఆర్బీకేలు
  • ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్న కాకాణి
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ప్రారంభించిన రైతు భ‌రోసా కేంద్రాలు (ఆర్బీకే) అంత‌ర్జాతీయ స్థాయి అవార్డులకు నామినేట్ అయ్యాయి. ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఏఓ) అవార్డులకు రైతు భ‌రోసా కేంద్రాలు నామినేట్ అయ్యాయి. ఈ విష‌యాన్ని ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి బుధ‌వారం వెల్ల‌డించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్బీకేలను సీఎం జగన్ తీసుకొచ్చార‌న్నారు. రెండేళ్లలోనే మంచి ఫలితాలను సాధించార‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో అన్న‌దాత‌ల‌కు మేలు చేసేందుకు 10,700 రైతు భరోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్న మంత్రి... ప్రతిపక్షానికి అసలు రైతుల కోసం మాట్లాడే అర్హత ఉందా? అని ప్ర‌శ్నించారు.
UNO
FAO
RBK
Andhra Pradesh
Kakani Govardhan Reddy
YSRCP

More Telugu News