Diabetes: మధుమేహుల కోసం మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు

Diabetes Diet 5 Quick And Easy Breakfast Options For Healthy Morning Meals
  • గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి కావాలి
  • మంచి పోషకాలు అందేలా చూసుకోవాలి
  • మేథి పరాటా, ఉడికించిన శనగలు మంచివి
  • రాగి దోశ ఎంతో సింపుల్
మధుమేహం (షుగర్/ డయాబెటిస్/ చక్కెర వ్యాధి)తో బాధపడుతున్న వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించడం ఎంతో అవసరం. అప్పుడే రక్తంలో గ్లూకోజు పరిమాణం అన్నివేళలా నియంత్రణలో ఉండేలా చూసుకోవడం సాధ్యపడుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అధిక కార్బొహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. మంచి ప్రొటీన్, ఫైబర్ ఉన్నవి ఆహారంలో భాగం చేసుకుంటే అప్పుడు ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మంచి పోషకాలు కలిగి, రక్తంలో గ్లూకోజ్ పెంచనీయని బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఇవి..

మేథి పరాటా
మెంతి ఆకులతో చేసుకునే పరాటా. ఇందుకు గోధుమ పిండి, మెంతి కూర, బీన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ, నూనె కావాలి. మెంతుల్లో జీఐ చాలా తక్కువ. మధుమేహం ఉన్న ఎవరికైనా ఇది మంచి చేస్తుంది. మేథి పరాటాను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు పెరగకుండా ఉండడమే కాకుండా, మంచి పోషకాలు లభిస్తాయి.

బేసన్ మేథి చీలా
శనగ పిండి, మెంతి కూరతో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఇది. మంచి ఫైబర్ తో పాటు, మెగ్నీషియం తగినంత అందుతుంది. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు నీరు, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, కారం, గ్రీన్ చిల్లీ, ఒక కప్పు మెంతి ఆకులు (తరిగినవి), నూనె కావాలి.

ఉడికించిన కోడిగుడ్డు
ఆమ్లెట్ కంటే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది. దీనివల్ల నూనెతో అవసరం పడదు.

కాలాచానా చాట్
శనగలతో చేసుకునే చాట్ ఇది. ఒక రాత్రంతా శనగలను నాన బెట్టి, మర్నాడు ఉదయం వాటిని ప్రెషర్ కుక్కుర్ లో ఉడికించి, వాటికి ఉడికించిన బంగాళాదుంపలు, మసాలా జోడించుకుని తినేయడమే. ఒక కప్పు శనగలు., అర కప్పు కొత్తిమీర ఆకులు, గ్రీన్ చిల్లీ, తరిగిన ఆనియన్, ఒక కప్పు ఉడికించిన బంగాళా దుంపలు (ముక్కలుగా కోసుకున్నవి), ఉప్పు, చాట్ మసాలా, జీర, కొద్దిగా నిమ్మరసం అవసరమవుతాయి.

రాగి దోశ 
రాగి పిండితో దోశ పోసుకోవడం వల్ల మంచి పోషకాలు అందడమే కాదు.. రక్తంలో గ్లూకోజ్ కూడా చక్కటి నియంత్రణలో ఉంటుంది. రాగి, గోధుమ పిండి, మజ్జిగ కలిపి రాత్రంతా అలా ఉంచేసి మర్నాడు ఉదయం దోశలా పోసుకుని తినేయడమే.
Diabetes
Diet
Breakfast
Options

More Telugu News