ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న యోగి ఆదిత్యనాథ్!

yogi adityanath taken blessings from mother
  • ఉత్తరాఖండ్ లోని పౌరీలో పర్యటించిన యోగి
  • కుటుంబ కార్యక్రమానికి హాజరు
  • ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న యూపీ సీఎం
చాలా కాలం తర్వాత తనయుడిని చూసిన తల్లి ఎంతగా సంతోషిస్తుందో చెప్పలేం కదా.. అందులోనూ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం తన పుత్రుడికి కలగడం ఆ తల్లికి మరింత ఆనందదాయకం కదా! యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చూసిన ఆయన మాతృమూర్తి కూడా అలాగే ఎంతో సంతోషపడగా, అమ్మ దీవెనలతో యోగి కూడా ఆనందంతో పొంగిపోయారు. 

యూపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంటే సుమారు ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్నారాయన. ఈ అరుదైన దృశ్యం మంగళవారం ఉత్తరాఖండ్ లోని పౌరీలో చోటు చేసుకుంది. అది యోగి స్వగ్రామం. సుమారు 28 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆయన తన సొంతూరులో అడుగు పెట్టారు.

ఈ సందర్భంగా అమ్మ పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. యోగి మేనల్లుడికి పుట్టు వెంట్రుకల వేడుక బుధవారం ఉండడంతో సొంతూరికి చేరుకున్నారు. ప్రధాని మోదీ మాదిరే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కుటుంబానికి దూరంగా ఉంటుంటారు.

కరోనా సమయంలో 2020 ఏప్రిల్ లో కన్నతండ్రి అంత్యక్రియలకు సైతం యోగి వెళ్లలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు అందరికీ తండ్రిగా కోవిడ్ నిబంధనల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తానే, వాటిని ఉల్లంఘిస్తే ఎలా? అంటూ ఆయన ఆ సందర్భంలో విమర్శకులను ప్రశ్నించారు.
Go Back to Shorts
yogi adityanath
Up Cm
mother
blessings

More Telugu News