Kurnool: కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు

  • బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని మెసేజ్
  • అప్‌డేట్ చేసుకోవాలంటూ లింక్
  • వివరాలు ఫిల్ చేసి సెండ్ చేసిన ఎంపీ
  • రంగంలోకి దిగి ఓటీపీ, ఇతర వివరాలు అడిగిన సైబర్ మోసగాడు
  • ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.97,699 మాయం
Kurnool MP Sanjeev Kumar cheeted by cyber Criminal

కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్‌ను ఓ సైబర్ మోసగాడు బురిడీ కొట్టించాడు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దానిని వెంటనే పాన్ నంబరుతో అప్‌డేట్ చేసుకోవాలంటూ మొన్న ఆయన మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అప్‌డేట్ చేసుకునేందుకు కింద లింక్ కూడా ఉండడంతో నిజమేనని నమ్మిన ఎంపీ వెంటనే లింకు ఓపెన్ చేసి వివరాలు ఫిల్ చేసి సెండ్ చేశారు.

వెంటనే ఆయన మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. ఆ వెంటనే హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకుని ఖాతా అప్‌డేట్ అయిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 

ఆ తర్వాత కాసేపటికే ఒకసారి రూ. 48,700, మరోసారి రూ. 48,999 డ్రా అయినట్టు ఎంపీ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసి హతాశుడైన ఎంపీ సంజీవ్ కుమార్ వెంటనే బ్యాంకుకు ఫోన్ చేస్తే మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాడు తనను బురిడీ కొట్టించినట్టు గ్రహించిన ఆయన వెంటనే కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాడు మొత్తంగా రూ.97,699 కాజేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాడి గురించి ఆరా తీస్తున్నారు.

More Telugu News