రొటీన్‌కు భిన్నంగా... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజ‌రాత్‌

03-05-2022 Tue 19:32 | Sports
  • పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లో గుజ‌రాత్‌
  • దిగువ నుంచి మూడో స్థానంలో పంజాబ్‌
  • టాస్ ఓడి బౌలింగ్‌కు దిగ‌నున్న మ‌యాంక్ టీం
gujarat wins the toss and elect to bat first
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌లో భాగంగా మంగ‌ళ‌వారం నాటి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ రొటీన్‌కు భిన్నంగా వ్య‌వ‌హరించింది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. ఐపీఎల్‌లోనే కాకుండా ఏ టీ20 మ్యాచ్ అయినా టాస్ గెలిచిన జ‌ట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రొటీన్‌కు భిన్నంగా సాగిన గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్‌కు బ‌దులుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. 

ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే ఆడిన 9 మ్యాచ్‌ల‌లో మిగిలిన జ‌ట్ల కంటే అత్య‌ధికంగా 8 మ్యాచ్‌ల‌ను గెలిచిన గుజ‌రాత్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో పంజాబ్ కూడా 9 మ్యాచ్‌లు ఆడి.. కేవ‌లం 4 మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన పంజాబ్‌.. పాయింట్ల ప‌ట్టిక‌లో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ గుజ‌రాత్ కంటే కూడా పంజాబ్‌కే కీల‌కంగా మారింది.