ఆ ఒక్క పదం వాడినందుకు క్షమాపణలు: సారీ చెప్పిన విష్వక్సేన్

  • అశోకవనంలో అర్జునకల్యాణం చిత్రం కోసం ప్రమోషన్స్
  • ప్రాంక్ వీడియో చేసిన విష్వక్సేన్
  • ఓ చానల్లో చర్చలో పాల్గొన్న విష్వక్ 
  • యాంకర్ పై అభ్యంతరకర పదం వాడిన హీరో
Hero Vishwak Sen apologized for his wrong word

'అశోకవనంలో అర్జునకల్యాణం' చిత్రం ప్రమోషన్స్ వికటించడం తెలిసిందే. హీరో విష్వక్సేన్ చేసిన ప్రాంక్ వీడియోపై ఓ చానల్ డిబేట్ నిర్వహించగా, యాంకర్ పై విష్వక్సేన్ పరుష పదజాలం ఉపయోగించాడు. మైక్ లు పీకేసి స్టూడియో నుంచి నిష్క్రమించాడు. విష్వక్సేన్ వైఖరిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో విష్వక్సేన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. యాంకర్ పై ఒక్క పదం తప్పుగా మాట్లాడానని, అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు. దెబ్బతగిలితే అమ్మా అంటాం... అలాగే స్టూడియోలో జరిగిన ఘటనతో నాకు బాధ కలిగి వెంటనే ప్రతిస్పందించాను. యువకుడిని కావడంతో దుందుడుకుగా మాట్లాడాను. ఆ ఒక్క అభ్యంతరకర పదం తప్ప మరెలాంటి తప్పు చేయలేదు అని విష్వక్సేన్ వివరణ ఇచ్చాడు.

More Telugu News