Chiranjeevi: చాన్నాళ్ల తర్వాత విదేశీ యాత్రకు చిరంజీవి

Chiranjeevi and Surekha off to US and Europe tour for brief vacation
  • ఇటీవల ఆచార్య రిలీజ్
  • అమెరికా, యూరప్ దేశాల టూర్ కు బయల్దేరిన చిరంజీవి
  • అర్ధాంగి సురేఖతో కలిసి పర్యటన
  • సోషల్ మీడియాలో వెల్లడించిన మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా విదేశీ యాత్రకు బయల్దేరారు. అర్ధాంగి సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత అమెరికా, యూరప్ దేశాలకు పర్యటనకు వెళుతున్నట్టు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాప్తి తర్వాత తాను విదేశీ యాత్రకు వెళ్లడం ఇదే ప్రథమం అని తెలిపారు. కొన్నిరోజుల విహారయాత్ర అనంతరం తిరిగొస్తానని పేర్కొన్నారు. 

చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన మోహనరాజాతో గాడ్ ఫాదర్, బాబీతో ఓ చిత్రం, మెహర్ రమేశ్ తో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. అటు, రాధిక సొంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లోనూ నటించేందుకు ఓకే చెప్పారు. 

కాగా, చిరంజీవి సోషల్ మీడియా అప్ డేట్ పట్ల నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఫారెన్ టూర్ వెళ్లే క్రమంలో సురేఖతో కలిసి విమానంలో కూర్చున్న ఫొటోను చిరంజీవి పంచుకోగా, రెండు లక్షల వరకు లైకులు వచ్చాయి.
Chiranjeevi
Surekha
Foreign Tour
USA
Europe
Tollywood

More Telugu News