Sanju Samson: స్లో పిచ్ పై మా బ్యాటర్లు రాణించలేకపోయారు: రాజస్థాన్ కెప్టెన్ సంజు శామ్సన్

Sanju Samson rues batting failure in defeat against Kolkata
  • డెత్ ఓవర్లలో బౌండరీలు సాధించాల్సిందన్న సంజు  
  • 15-20 పరుగులు తక్కువ చేశామని వ్యాఖ్య 
  • ప్రత్యర్థి బౌలింగ్ బలంగా ఉందన్న రాజస్థాన్ కెప్టెన్
కోల్ కతా నైట్ రైడర్స్ తో సోమవారం నాటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి పిచ్ సహకరించకపోవడం కారణమని ఆ జట్టు కెప్టెన్ సంజు శామ్సన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో (ఆఖరి ఓవర్లు) రాజస్థాన్ బ్యాట్స్ మెన్ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. చివరి ఓవర్లో కోల్ కతా జట్టు (కేకేఆర్) విజయం సాధించడం తెలిసిందే.

‘‘పిచ్ నిదానంగా ఉంది. అందుకే మా బ్యాట్స్ మెన్ ఫెయిల్ అయ్యారు. కనీసం మరో 15-20 పరుగులు అయినా అధికంగా చేయాల్సింది. వారు (కేకేఆర్) బౌలింగ్ బాగా చేశారు. మా బ్యాటింగ్ విషయానికొస్తే చివర్లో కొన్ని బౌండరీలు సాధించి ఉంటే బావుండేది’’ అని శామ్సన్ తెలిపాడు. నిన్నటి మ్యాచ్ లో శామ్సన్ 54 పరుగులతో ఈ సీజన్ లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ తో నిజంగా గట్టిగా పోరాటం చేశామన్న శామ్సన్.. ఇంకొంచెం కష్టపడితే మంచి ఫలితం దక్కేదన్నాడు. 



Sanju Samson
batting
failure
KKR
rajasthan royals
IPL

More Telugu News