KKR: ​ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో కోల్ కతా... నేడు రాజస్థాన్ తో పోరు​

KKR set to face RR in must need win in every match situation
  • హోరాహోరీగా ఐపీఎల్
  • దగ్గరపడుతున్న ప్లే ఆఫ్ దశ
  • 9 మ్యాచ్ లలో 6 ఓటములు ఎదుర్కొన్న కోల్ కతా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్ అయ్యర్
ఐపీఎల్ లో ప్లే ఆఫ్ దశ దగ్గరపడే కొద్దీ పోరాటం మరింత రంజుగా మారింది. ప్రతి జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. వెంకటేశ్ అయ్యర్, శివం మావి జట్టులోకి వచ్చారు. తొలిసారిగా యువ ఆటగాడు అనుకూల్ రాయ్ నేటి మ్యాచ్ ద్వారా బరిలో దిగుతున్నాడు. అటు, రాజస్థాన్ జట్టులో ఒక మార్పు జరిగింది. డారిల్ మిచెల్ స్థానంలో కరుణ్ నాయర్ ను తీసుకున్నట్టు కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. 

9 మ్యాచ్ లలో 6 పరాజయాలతో ప్లే ఆఫ్ ఆశలను కోల్ కతా సంక్లిష్టం చేసుకుంది. దాంతో మిగిలిన మ్యాచ్ లలో తప్పక గెలిస్తేనే ఆ జట్టుకు ఆవకాశాలు ఉంటాయి. సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే.
KKR
Toss
RR
IPL

More Telugu News