Pawan Kalyan: ఈ నెల 8న కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర

Pawan Kalyan will tour in Kurnool district
  • రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు
  • ఇప్పటికే అనంతపురం, ప.గోదావరి జిల్లాలో పవన్ సాయం
  • కర్నూలు జిల్లాలో తొలివిడతలో 130 మందికి సాయం
  • మిగిలినవారికి రెండో విడతలో సాయం

ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తుండడం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు. ఈ క్రమంలో, ఈ నెల 8న కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు.

8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొంటారని నాదెండ్ల తెలిపారు. కాగా, తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందించనున్నారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News