Chandrababu: మహిళలపై దాడులు, రైతుల ఆత్మహత్యలపై పార్టీ నేతలతో కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయం

Chandrababu decides to deploy committees on atrocities over women and farmers suicides
  • పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
  • మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై చర్చ
  • కమిటీల ద్వారా పోరాడాలని నిర్ణయం
  • వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని వ్యాఖ్యలు

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, మహిళల మీద అఘాయిత్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో, మహిళలపై దాడులు, రైతుల ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక్క ఏప్రిల్ లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయని అన్నారు. పరిశ్రమలు రాక, ఉపాధి లేక యువత వలసపోతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News