Telangana High Court: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్
  • ఈ నెల 7న ఓయూకి వెళ్లాలని నిర్ణయం
  • అనుమతి నిరాకరించిన ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
  • హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ
  • విద్యార్థులు పిటిషన్ లో పేర్కొన్న అంశాలను పరిశీలించాలని ఉస్మానియా వీసీకి కోర్టు ఆదేశాలు  
Telangana high court orders on Rahul Gandhi OU visit

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యార్థులు పిటిషన్ లో పేర్కొన్న అంశాలను పరిశీలించాలని ఉస్మానియా వర్సిటీ వీసీని ఆదేశించింది. కాగా, ఈ విచారణకు ప్రభుత్వం, ఉస్మానియా వర్సిటీ తరఫున న్యాయవాదులు హాజరు కాలేదని తెలుస్తోంది. 

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ నెల 7న ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. అయితే, అందుకు ఓయూ కార్యనిర్వాహక మండలి నుంచి అనుమతి లభించలేదు. దాంతో విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

More Telugu News