Kodandaram: ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీపై కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు

  • పీకే ప్రకటన వెనుక కేసీఆర్ ఉన్నారన్న కోదండరామ్  
  • జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పీకేను కేసీఆర్ వాడుకుంటున్నారని వ్యాఖ్య 
  • ఓయూలో రాహుల్ సభకు అనుమతినివ్వాలని సూచన  
Kodanda Ram comments on Prashat Kishor party

సొంతంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పందిస్తూ పీకే ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పీకేను కేసీఆర్ వాడుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ, పీకే పెట్టబోయే పార్టీ రెండూ ఒకటేననే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. 

ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభకు అనుమతిని నిరాకరించడంపై కోదండరామ్ స్పందస్తూ... రాహుల్ సభకు అనుమతిని ఇవ్వాలనేదే ఒక ప్రొఫెసర్ గా తన అభిప్రాయమని చెప్పారు. రాహుల్ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని తెలిపారు. వివిధ పార్టీల నాయకులు యూనివర్శిటీకి రావడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం 25 నియోజకవర్గాలపై పూర్థి స్థాయిలో దృష్టి సారిస్తున్నామని తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు.

More Telugu News