Jignesh Mevani: ప్రధాని కార్యాలయంలో గాడ్సే భక్తులు ఉన్నారు: జిగ్నేష్ మేవాని

Godsey followers are there in PMO says Jignesh Mevani
  • తనను అరెస్ట్ చేయించిన కుట్రలో గాడ్సే భక్తుల హస్తం ఉందన్న జిగ్నేష్ 
  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్య 
  • ఎలాంటి కుట్రలకూ భయపడే ప్రసక్తే లేదన్న జిగ్నేష్ 
గుజరాత్ కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని మరోసారి ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ప్రధాని కార్యాలయంలో గాడ్సే భక్తులు ఉన్నారని... తనను అరెస్ట్ చేయించిన కుట్రలో ఈ గాడ్సే భక్తుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జిగ్నేష్ మాట్లాడుతూ, త్వరలోనే గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని... అందువల్లే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఒక కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని మండిపడ్డారు. బీజేపీ ఎలాంటి కుట్రలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.
Jignesh Mevani
PMO
Narendra Modi
BJP
Gujarat
Assembly Elections

More Telugu News