అందుబాటులోని నెలవారీ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!

  • వీఐ నుంచి నాలుగు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లు
  • జియో, ఎయిర్ టెల్ నుంచి రెండు చొప్పున 
  • వీటిల్లో రోజువారీ, నెలవారీ డేటా పరిమితి ప్యాక్ లు
prepaid recharge plans from Airtel Vodafone Idea Reliance Jio

ట్రాయ్ ఆదేశంతో టెలికం కంపెనీలు నెలవారీ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఒక్కో కంపెనీ ఒకటికి మించిన రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టాయి. 30 రోజులు, లేదా నెలవారీ ప్లాన్ ను తీసుకురావాలని ట్రాయ్ లోగడే టెలికం కంపెనీలను ఆదేశించడం తెలిసిందే.

వీఐ (వోడాఫోన్-ఐడియా) రూ.319
ఈ ప్లాన్ లో యూజర్లు రోజువారీ 2 జీబీ ఉచిత డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత ఉచిత కాలింగ్, నిత్యం 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీని కాలవ్యవధి నెల. 

వీఐ రూ.195
అపరిమిత ఉచిత కాలింగ్ తోపాటు, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ లో భాగంగా లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 31 రోజులు. నెల మొత్తం మీద ఉచిత డేటా 2జీబీ మాత్రమే.

జియో రూ.256
కేలండర్ ప్రకారం ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఉదాహరణకు మే 2న రీచార్జ్ చేస్తే జూన్ 1తో వ్యాలిడిటీ ముగుస్తుంది. ఉచిత కాల్స్ కు పరిమితి లేదు. రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం. రోజువారీ 1.5 జీబీ డేటా ఉచితం. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 

జియో రూ.296
30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాల్స్ ఉచితం. నిత్యం 100 వరకు ఎస్ఎంఎస్ లు ఉచితం. రోజువారీ 2 జీబీ డేటా కూడా ఉచితం. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 

ఎయిర్ టెల్ రూ.319
వ్యాలిడిటీ నెల రోజులు. రోజువారీ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ కూడా పరిమితి లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు. 

ఎయిర్ టెల్ రూ.296
ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాల్స్ తోపాటు, రోజువారీగా 100 వరకు ఎస్ఎంఎస్ లు ఉచితం. 25 జీబీ డేటా ఉచితం. రోజువారీ పరిమితి అమలు కాదు. ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే లోపు ఈ డేటాను వినియోగించుకోవచ్చు. 

వీఐ రూ.337 ప్లాన్
కాల్స్  ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. 28జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. వ్యాలిడిటీ 31 రోజులు. 

వీఐ రూ.327
అపరిమిత ఉచిత కాలింగ్ తోపాటు రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. 25 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. వ్యాలిడిటీ 30 రోజులు. 

More Telugu News