Realme Pad Mini: నేటి నుంచే రియల్ మీ ప్యాడ్ మినీ విక్రయాలు.. ఆకర్షణీయమైన ధరకే

  • వైఫై, ఎల్టీఈకి సపోర్ట్ చేసే రెండు రకాలు
  • రూ.10,999 నుంచి ధరలు ప్రారంభం
  • రూ.2,000 తగ్గింపు ఆఫర్
  • విద్యార్థులకు అనుకూలమన్న కంపెనీ
Realme Pad Mini will be on sale today here are top 3 features why you should consider this Android tablet

రియల్ మీ ప్యాడ్ మినీ (ఆండ్రాయిడ్) విక్రయాలు మొదటిసారిగా సోమవారం మధ్యాహ్నం మొదలయ్యాయి. రియల్ మీ ప్యాడ్ కంటే ప్యాడ్ మినీ కొంచెం చిన్నదిగా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సైజులోనే కాదు, పనితీరులోనూ రియల్ మీ ప్యాడ్ తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చినట్టు రియల్ మీ సంస్థ ప్రకటించింది. 

పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీ ఆకర్షణీయంగా ఉంటుంది. వైఫై, ఎల్టీఈని సపోర్ట్ చేసే రకాలు ఇందులో ఉన్నాయి. వైఫైపై పనిచేసే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ధర రూ.10,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. అదే ఎల్టీఈ (4జీని నెట్ వర్క్ సిమ్ తో పనిచేసే) వేరియంట్ 3జీబీ, 32జీబీ ధర రూ.12,999. 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.14,999. బ్లూ, గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. 

ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇవి లభించనున్నాయి. మొదటి సారి విక్రయాల్లో కొనుగోలుదారులకు రూ.2,000 తగ్గింపును రియల్ మీ ఆఫర్ చేస్తోంది.

8.7 అంగుళాల స్క్రీన్, హెచ్ డీ రిజల్యూషన్ తో ఉంటుంది. బెజెల్స్ పలుచుగా ఉంటాయి. అలాగే యూనిసాక్ ప్రాసెసర్ వాడారు. ఇందులో 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. 16 గంటల పాటు వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చని రియల్ మీ ప్రకటించింది.

More Telugu News