ప్రయాణికులను హడలెత్తించిన స్పైస్ జెట్ విమానం.. 10 మందికి గాయాలు

  • ల్యాండింగ్ సమయంలో సమస్య
  • తీవ్ర కుదుపులకు లోనైన విమానం
  • దుర్గాపూర్ లో సురక్షితంగా ల్యాండింగ్
  • గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
Passengers on SpiceJet horror flight recount narrow escape

స్పైస్ జెట్ విమాన సర్వీసు ఒకటి.. ప్రయాణికులకు అజయ్ దేవగణ్ నటించిన ‘రన్ వే 34’ సినిమాను గుర్తు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న విమానాన్ని ల్యాండ్ చేయడం రన్ వే 34 సినిమాలో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితే ఆదివారం ముంబై నుంచి దుర్గాపూర్ కు వెళుతున్న స్పైస్ జెట్ ఎస్జీ-945 సర్వీసుకు ఎదురైంది. గమ్య స్థానంలో ల్యాండ్ చేస్తున్న క్రమంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. 

దీంతో విమానం లోపలి ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురయ్యాయి. లగేజీ బ్యాగేజీలు వచ్చి మీద పడ్డాయి. దీంతో పది మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులను ప్రయాణికులు కొందరు తమ ఫోన్లలో వీడియో తీయగా.. అటువంటి వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరింది. ఎట్టకేలకు విమానం దుర్గాపూర్ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అయింది. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల స్పైస్ జెట్ విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది.

More Telugu News