విష్వక్సేన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే!

  • మొదటి నుంచి మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన విష్వక్సేన్
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'
  •  రేపు సాయంత్రం ఖమ్మంలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 6వ తేదీన సినిమా విడుదల  
Asokavanamlo Arjuna Kalyanam Movie Update

విష్వక్సేన్ కథానాయకుడిగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నారు. ఖమ్మం .. లేక్ వ్యూ క్లబ్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనేది ఎనౌన్స్ చేయనున్నారు. పెళ్లి చూపుల చుట్టూ తిరిగే కథ ఇది.  దాదాపు గ్రామీణ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. 

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. ఇంతవరకూ విష్వక్సేన్ మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు సంపాదించాలనే ఆలోచనతో ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

More Telugu News