CM Jagan: పితృవియోగంతో బాధపడుతున్న శత్రుచర్ల పరీక్షిత్ రాజుకు సీఎం జగన్ పరామర్శ

CM Jagan talks to Satrucharla Parikshit Raju
  • మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కన్నుమూత
  • విశాఖలో గత శుక్రవారం మృతి
  • పరీక్షిత్ రాజుతో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్
  • చంద్రశేఖరరాజు మృతికి ప్రగాఢ సంతాపం

వైసీపీ అరకు లోక్ సభ స్థానం ఇన్చార్జి శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఇటీవల తండ్రిని కోల్పోయారు. పరీక్షిత్ రాజు తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజు అనారోగ్యంతో బాధపడుతూ గత శుక్రవారం కన్నుమూశారు. మూడ్రోజుల పాటు విశాఖలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దాంతో శత్రుచర్ల కుటుంబంలో విషాదం నెలకొంది. 

ఈ నేపథ్యంలో సీఎం జగన్ శత్రుచర్ల పరీక్షిత్ రాజుకు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులు అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News