Janasena: "సీఎం జగన్ వస్తున్నాడు మీ కార్లు జాగ్రత్త" అంటూ తిరుపతిలో జనసేన వినూత్న ప్రచారం... వీడియో ఇదిగో!

Janasena campaigns in Tirupati ahead of CM Jagan tour
  • ఇటీవల ఒంగోలులో ఘటన
  • సీఎం కాన్వాయ్ కి కారు కావాలంటూ దాష్టీకం
  • తిరుమల వెళుతున్న భక్తుల కారు తీసేసుకున్న వైనం
  • భగ్గుమన్న విపక్షాలు

సీఎం జగన్ కాన్వాయ్ కి కారు అవసరమైందంటూ ఇటీవల ఒంగోలులో తిరుపతి వెళుతున్న భక్తుల నుంచి కారును తీసేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయ పక్షాలు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ వినూత్న ప్రచారం చేపట్టింది. సీఎం జగన్ తిరుపతి వస్తున్నాడని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 

జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. 

సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News