"సీఎం జగన్ వస్తున్నాడు మీ కార్లు జాగ్రత్త" అంటూ తిరుపతిలో జనసేన వినూత్న ప్రచారం... వీడియో ఇదిగో!

  • ఇటీవల ఒంగోలులో ఘటన
  • సీఎం కాన్వాయ్ కి కారు కావాలంటూ దాష్టీకం
  • తిరుమల వెళుతున్న భక్తుల కారు తీసేసుకున్న వైనం
  • భగ్గుమన్న విపక్షాలు
Janasena campaigns in Tirupati ahead of CM Jagan tour

సీఎం జగన్ కాన్వాయ్ కి కారు అవసరమైందంటూ ఇటీవల ఒంగోలులో తిరుపతి వెళుతున్న భక్తుల నుంచి కారును తీసేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయ పక్షాలు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ వినూత్న ప్రచారం చేపట్టింది. సీఎం జగన్ తిరుపతి వస్తున్నాడని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 

జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. 

సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

More Telugu News