Ch Malla Reddy: అన్నా.. నేను నీ అంత గొప్పవాడ్ని కాదన్నా!: చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడిన మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy hails Megastar Chiranjeevi
  • హైదరాబాదులో మేడే ఉత్సవం
  • హాజరైన మంత్రి మల్లారెడ్డి, చిరంజీవి
  • కార్మికుల కోసం చిరంజీవి సినిమాలు తీయాలన్న మంత్రి
మేడే సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్మికోత్సవానికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఆకాశానికెత్తేశారు. 

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... "అన్నా... నేను నీ అభిమానిని అన్నా. నేను నీ అంత ఫేమస్ కాదన్నా! నువ్వు కేంద్రమంత్రివి కూడా అయ్యావు అన్నా. మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారన్నా. మొత్తం ఫిలిం ఇండస్ట్రీనంతా దున్నేస్తున్నావన్నా నువ్వు! నువ్వు అన్నీ సాధించావన్నా! కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చావు... వాళ్లను ఆదుకున్నావు. కష్టకాలంలో కార్మికుల కోసం నిలబడింది నువ్వొక్కడివే అన్నా. నాదొక రిక్వెస్ట్ అన్నా... ఇకపై కార్మికుల కోసం సినిమాలు, ఓటీటీ కంటెంట్ తీయాలన్నా. ఓటీటీ కంటెంట్ లో కార్మికులను కూడా భాగస్వాములను చేసి, వాళ్లకు కూడా షేర్ ఇస్తే వాళ్లు గొప్పవాళ్లయిపోతారన్నా!" అంటూ తన మనోభావాలను సభాముఖంగా చిరంజీవికి నివేదించారు.
Ch Malla Reddy
Chiranjeevi
May Day
Tollywood

More Telugu News