లౌడ్ స్పీకర్లు లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే: తేజశ్వి యాదవ్ వ్యాఖ్యలు

01-05-2022 Sun 12:17
  • ప్రార్థనా స్థలాల్లో 1970ల నుంచే లౌడ్ స్పీకర్లు
  • నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడరెందుకు
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • ట్విట్టర్ లో తేజశ్వి యాదవ్ ట్వీట్
Did not God exist when RJDs Tejashwi Yadavs question on loudspeaker row
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న తరుణంలో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్.. వివాదాన్ని పెంచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మత సారాంశాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదని, అవనసరమైన అంశాలకు మతం రంగు పులుముతున్నారని పేర్కొన్నారు. ట్విట్టర్ లో  ఈ అంశానికి సంబంధించి తేజశ్వి యాదవ్ కొన్ని ట్వీట్ పెట్టారు.

‘‘లౌడ్ స్పీకర్లను ఒక వివాదాస్పద అంశంగా మార్చిన వారిని నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. 1970ల నుంచి మసీదులు, ఆలయాల్లో వాటిని వాడుతున్నారు. అక్కడ లౌడ్ స్పీకర్లు లేకపోతే దేవుడు కూడా లేనట్టే? దాంతో అక్కడ ప్రార్థన జరగదు’’ అంటూ ట్వీట్ చేశారు. 

‘‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతులు, కార్మికుల పరిస్థితిపై ఎందుకు చర్చ జరగదు. లౌడ్ స్పీకర్లు, బుల్డోజర్ల గురించే చర్చ ఎందుకు? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవ అంశాలకు దూరంగా వెళుతున్నారు’’అని మరో ట్వీట్ లో తేజశ్వి యాదవ్ నేతల తీరును ప్రశ్నించారు.