Tiger: హైదరాబాద్ జూలో రాయల్ బెంగాల్ టైగర్ కు 'ప్రభాస్' పేరు

Royal Bengal Tiger named Prabhas gets special attention in Hyderabad Zoo
  • పులిని దత్తత తీసుకున్న మహిళ
  • పులికి ప్రభాస్ పేరిట నామకరణం
  • జూలో ప్రత్యేక ఎన్ క్లోజర్
  • సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులు దాటి, ఆసియా దేశాలకు కూడా పాకింది. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమాలో నటించినా అది పాన్ ఇండియా సినిమా అవుతోంది. కాగా, ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనంగా ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఓ పులికి ప్రభాస్ పేరు పెట్టారు. 

అది ఒక రాయల్ బెంగాల్ టైగర్. దాన్ని రచనా చౌదరి అనే మహిళ దత్తత తీసుకున్నారు. కాగా, ఆ పులికి హైదరాబాద్ జూలో ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ ఏర్పాటు చేసిన అధికారులు దాని వివరాలతో  బోర్డు పెట్టారు. రాయల్ బెంగాల్ టైగర్ అని రాసి బ్రాకెట్లో 'ప్రభాస్' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దటీజ్ ప్రభాస్ అంటూ యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రాయల్ బెంగాల్ టైగర్ హైదరాబాద్ జూలో సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 
.
Tiger
Prabhas
Zoo
Hyderabad
Tollywood

More Telugu News