CM Jagan: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఏపీ సీఎం జగన్ సమావేశం

CM Jagan met union health minister in Delhi
  • ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
  • మన్సుఖ్ మాండవీయతో అరగంట సేపు భేటీ
  • ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని మంత్రికి వెల్లడి
  • 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. ఏపీకి 13 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల తాము 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం జగన్... ఆయా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. మన్సుఖ్ మాండవీయతో సీఎం జగన్ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది.
CM Jagan
Mansukh Mandaviya
Medical Colleges
New Districts
Andhra Pradesh

More Telugu News