Andhra Pradesh: శెట్టిబలిజలకు మంత్రి వేణు త‌క్ష‌ణ‌మే క్షమాపణ చెప్పాలి: జ‌న‌సేన‌

janasena pac member pitani balakrishna demands sorry from minister chulluboina venugopalakrishna
  • వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లిన మంత్రి వేణుగోపాల కృష్ణ‌
  • ఈ చ‌ర్య ద్వారా మంత్రి శెట్టి బ‌లిజ‌ల ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీశారు
  • బీసీల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేసింద‌న్న పితాని బాల‌కృష్ణ‌
శెట్టిబ‌లిజ‌ల‌కు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌న‌సేన డిమాండ్ చేసింది. ఈ మేర‌కు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు పితాని బాల‌కృష్ణ శ‌నివారం డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ముందు మోక‌రిల్లి దండాలు పెట్టి శెట్టి బ‌లిజ‌ల ఆత్మ గౌర‌వాన్ని మంత్రి దెబ్బ తీశార‌ని ఆయ‌న ఆరోపించారు.

వైవీ సుబ్బారెడ్డిని ఓ ముఠా నాయ‌కుడిగా అభివ‌ర్ణించిన పితాని బాల‌కృష్ణ.. ముఠా నాయకుడి కాళ్ల మీద ప‌డిన మంత్రి వేణుగోపాల కృష్ణ శెట్టి బ‌లిజ‌లు త‌ల వంచుకునేలా చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక బీసీల‌కు ఏం ల‌బ్ధి జ‌రిగిందో చెప్పాల‌ని కూడా పితాని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Janasena
Janasena PAC
Pitani Balakrishna
Chelluboina VenuGopalaKrishna

More Telugu News