Ganji Prasad: నా భర్త హత్యకు వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం:  గంజి ప్రసాద్ భార్య

YSRCP MLA Talari Venkat Rao is responsible for my husband murder says Ganji Prasad
  • దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్
  • ఎమ్మెల్యే తలారి వెంకట్రావే హత్య చేయించారన్న ప్రసాద్ భార్య
  • హోంమంత్రికి తన భర్త అనుచరుడని వ్యాఖ్య
తన భర్త హత్యకు వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని గంజి ప్రసాద్ భార్య సత్యవతి అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే తలారి ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారియా అనుచరులు తన భర్తను హత్య చేశారని తెలిపారు. హోం మంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడని... ఇకపై వాళ్ల ఆటలు సాగవని అన్నారు. 

తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని చెప్పారు. మరోవైపు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారిపై ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను రక్షించడానికి పోలీసులు ఆయనను పక్న ఉన్న స్కూల్ లోకి తరలించారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వయంగా ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.
Ganji Prasad
Talari Venktrao
YSRCP

More Telugu News