Jaqueline Fernandez: జాక్వెలిన్ కు షాకిచ్చిన ఈడీ.. రూ. 7.27 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్!

ED attaches assets of Jaqueline Fernandez
  • సుకేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు షాక్
  • సుకేశ్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు తేల్చిన ఈడీ
  • సుకేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో భాగంగా జాక్వెలిన్ కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన వాటిలో రూ. 7 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లేనని సమాచారం. 

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులను అందుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన వజ్రాల చెవిపోగులు, బ్రాస్ లెట్లు, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్ లు తదితర కానుకలను జాక్వెలిన్, ఆమె కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ ఇచ్చినట్టు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తేల్చారు. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Jaqueline Fernandez
ED
Attach
Bollywood

More Telugu News