traffic: హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్

traffic restrictions in rudraram
  • సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద ప్ర‌మాదం
  • 65వ జాతీయ రహదారిపై ఘ‌ట‌న‌
  • లారీ, మూడు వ్యాన్లతో పాటు నాలుగు కార్లు వరుసగా ఢీ
హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై ప్ర‌మాదం జ‌ర‌గ‌డమే ఇందుకు కార‌ణం. రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై ఓ లారీ, మూడు వ్యాన్లతో పాటు నాలుగు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఈ ప్ర‌మాదం కార‌ణంగా జహీరాబాద్‌, షోలాపూర్‌ నుంచి వచ్చే మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు అక్క‌డి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ మార్గంలో వాహ‌నాల రాక‌పోక‌లు న‌త్త‌న‌డ‌క‌న కొన‌సాగుతున్నాయి.
traffic
Road Accident
Hyderabad
Karnataka

More Telugu News