Rakhi Sawant: నొప్పిని భరిస్తూనే తన మాజీ భర్త పేరును ఒంటిపై నుంచి తొలగించుకున్న రాఖీ సావంత్!

Rakhi Sawant erases her ex husband name tattoo from her body
  • మూడేళ్లలోనే రితేశ్ తో విడిపోయిన రాఖీ సావంత్
  • తన శరీరం నుంచి కూడా రితేశ్ శాశ్వతంగా వెళ్లిపోయాడని వార్త
  • ప్రేమలో ఉన్న వాళ్లు టాటూ వేయించుకోవద్దని సూచన
బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్... రితేశ్ సింగ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే వారి వైవాహిక బంధం తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. రితేశ్ కు అప్పటికే పెళ్లి అయిందనే విషయాన్ని తన వద్ద దాచి పెట్టాడని... ఆయన తొలి భార్యతో విడాకులు తీసుకోలేదు కాబట్టి తమ వివాహం చట్టబద్దంగా చెల్లదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన మొదటి భార్యతోనే ఉండేందుకు రితేశ్ సిద్ధపడటంతో గత వాలంటైన్స్ డే నాడు భర్తతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించింది. 

మరోవైపు తన భర్తపై ఉన్న ప్రేమతో అతని పేరును రాఖీ టాటూగా వేయించుకుంది. తాజాగా ఆ పేరును తీయించుకుంది. టాటూను తొలగించేటప్పుడు ఎంతో నొప్పి కలిగినా... దాన్ని భరిస్తూ అతని పేరును శరీరంపై నుంచి కూడా శాశ్వతంగా తొలగించింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ... 'రితేశ్ నువ్వు నా జీవితం నుంచే కాదు, నా శరీరం నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్టే' అని చెప్పింది. అంతేకాదు ప్రేమలో ఉండే వారికి ఓ సూచన కూడా చేసింది. ప్రేమలో మునిగితేలేవాళ్లు పచ్చబొట్టు మాత్రం వేయించుకోవద్దని... ఎందుకంటే దాన్ని తీసేయడం చాలా కష్టమని చెప్పింది.
Rakhi Sawant
Ex Husband
Tattoo
Bollywood

More Telugu News