షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్

Hero Gopichand injured in shooting
  • మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న గోపీచంద్ చిత్రం
  • ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడ్డ గోపీచంద్
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డైరెక్టర్ శ్రీవాస్
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ లోకేషన్ లో ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడి ఆయన గాయపడ్డాడు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని... అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు. గోపీచంద్ కు శ్రీవాస్ ఇప్పటికే 'లక్ష్యం', 'లౌక్యం' అనే రెండు విజయాలను అందించారు. ఇప్పుడు ఆయనతో మూడో సినిమా చేస్తున్నారు. 

ప్రస్తుతం గోపీచంద్ 30వ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ లో పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Gopichand
Tollywood
Injury

More Telugu News